Suneetha : గాయనిగా తనకంటూ గుర్తింపుతో దూసుకుపోతున్న సునీత తన అందంతో కూడా అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని తన అందం, అందమైన గాత్రంతో అందరిని అలరిస్తోంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత విడాకులు తీసుకుని సింగల్ విమెన్ గా ఇద్దరు పిల్లలను పెంచుతూ అందరికి ఆదర్శంగా కూడా నిలిచింది. ఇక రీసెంట్ గా మళ్ళీ పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది . మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని తో వివాహం తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ లో దూసుకుపోతోంది.
తనపై వచ్చే నెగెటివ్ రూమర్స్ కీ ఎప్పటికప్పుడు ఓపిగ్గా సమాధానాలు చెబుతూనే ఉంటుంది. లేటు వయసులో పెళ్లి అవసరమా అంటూ తనపై వచ్చిన కామెంట్స్ కు తన వైవాహిక జీవితంలో చాలా సంతోహంగా ఉన్నాను అంటూ సమాధానం చెప్పి నోర్లుమూయించింది. సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది. అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందని.. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ఆమె చూసుకుంటుందని తెలుస్తోంది. పైగా సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట.
ఇంకా సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తోంది. ఇలా సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇపుడు సునీత తాను మళ్ళీ తల్లి కావాలని అనుకుంటున్నారట. అయితే ఇందుకోసం ఆమె సరోగసి పద్దతిని ఆశ్రయిస్తున్నారట. ఈ వార్త ఇపుడు సోషల్. మీడియాలో లో బాగా వైరల్ అవుతోంది. మరి దీనిలో నిజమేంతో సునీత, రామ్ లే క్లారిటీ ఇవ్వాలి.