సరోగసి ద్వారా పిల్లల్ని కన్నా ప్రముఖ సింగర్.. క్లారిటీ ఇచ్చిన చిన్మయి?

ఏం మాయ చేసావే సినిమాలో సమంతకి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా మంచి గుర్తింపు పొందిన చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంతకి ఎన్నో సినిమాలలో డబ్బింగ్ చెప్పిన చిన్మయి తన మధురమైన గాత్రంతో పాటలు పాడి సింగర్ గా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ నయనతార విఘ్నేష్ శివన్ సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే వీరిద్దరూ చట్ట విరుద్ధంగా సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారని తమిళనాడు ప్రభుత్వం వీరి మీద విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో తమకి ఆరు సంవత్సరాల క్రితమే వివాహమైనట్లు ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే శిక్ష నుండి తప్పించుకోవటానికి నయన్ దంపతులు అబద్ధం ఆడుతున్నారని ప్రేక్షకులు సీరియస్ అవుతున్నారు. ఇలా నయన్ విగ్నేష్ సరోగసి వార్త తెరపైకి రాగానే సింగర్ చిన్మయి కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కనిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ వార్తలపై స్పందించిన చిన్మయి.. “తాను 32 వారాల గర్భంతో ఉన్న సమయంలో తీసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి చెంప దెబ్బ కొట్టినట్లు ఫోటోతో అందరికీ సమాధానం చెప్పింది. ఈ క్రమంలో గర్భవతిగా ఉన్న సమయంలో మరికొన్ని ఫోటోలు తీసుకోనందుకు నాకు ఇప్పుడు విచారణగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో నేను డబ్బింగ్, రికార్డింగ్ లు చేసినప్పుడు అందరూ నాతో ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు నా గర్భం గురించి గోప్యంగా ఉంచాలని వారిని వేడుకున్నాను. ఈ విషయంలో మీడియాకి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి” అంటూ వెల్లడించింది.