సుమ‌తో బెట్ పెట్టిన అభిమాని.. గెలిచినందుకు వెయ్యి రూపాయలు అడిగిన యాంక‌ర్

ఎప్పుడు గ‌ల‌గ‌ల మాట్లాడే సుమ త‌న మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేస్తుంటుంది. టైమింగ్‌కు త‌గ్గ‌ట్టు పంచ్‌లు వేయ‌డం, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో మాట్లాడ‌డం సుమ‌కే చెల్లింది. స్టార్ హీరోల‌తో సైతం చ‌నువుగా మాట్లాడే ధైర్యం సుమ‌కే ఉంది. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సుమ అభిమానుల‌తో ప్ర‌తి విష‌యాన్ని షేర్ చేసుకుంటూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య అర్ధ‌రాత్రి షూటింగ్ చేయాల్సి రావ‌డంతో త‌న‌పై తానే పంచ్ వేసుకుంటూ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. స్టార్ హీరోయిన్‌తో స‌మానంగా పాపుల‌రాటి ద‌క్కించుకున్న సుమతో మాట్లాడాలని, వీలైతే ఫొటో దిగాల‌ని ఆమె ఫ్యాన్స్ ఎంత‌గానో భావిస్తుంటారు.

కొంద‌రు నెటిజ‌న్స్ సుమ‌ని రెగ్యుల‌ర్‌గా ఫాలో కావ‌డంతో పాటు ఆమె వీడియోల‌కు రెస్పాన్స్ ఇస్తుంటారు. అయితే ఎన్ని కామెంట్స్ పెట్టిన సుమ రెస్పాండ్ కాక‌పోయేస‌రికి ఒక్కోసారి చాలా డిస‌ప్పాయింట్ అవుతుంటారు. ఆమెకున్న బిజీ షెడ్యూల్ వ‌ల‌న అంద‌రికి రిప్లై ఇవ్వ‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే. అయితే ఓ నెటిజ‌న్ తెలివిగా సుమ‌తో బెట్ పెట్టాడు. నాకు మీరు రిప్లై ఇవ్వ‌రి వెయ్యి రూపాయ‌ల పందెం అని కామెంట్ పెట్టాడు. దానికి స్పందించిన సుమ రిప్లై ఇచ్చాను. వెయ్యి రూపాయ‌లు పంపించు, నా అకౌంట్ నెంబర్ పంపిస్తాను అని చెప్పుకొచ్చింది. సుమ సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

ఒక‌వైపు ప‌లు షోస్‌కు యాంక‌రింగ్ చేస్తూనే మరోవైపు సొంత యూట్యూబ్ ఛానెల్‌తో ర‌చ్చ చేస్తుంది సుమ‌. ఇటీవ‌ల సుమ‌క్క అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన సుమ ఆ షోకు ప‌లువురు సెల‌బ్రిటీల‌ని తీసుకొచ్చి వారి చేత వంట‌లు వండిస్తుంది . ఈ ఛానెల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండ‌గా, దాదాపు 1 మిలియన్ సబ్ స్క్రైబర్స్ కు చేరువగా వచ్చింది సుమక్క ఛానెల్. ఇక ఇటీవ‌ల త‌న కుమారుడిని కూడా వెండితెరకు ప‌రిచయం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి కాగా, త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించ‌నున్నారు