షారూఖ్ కూతురికి, అమితాబ్ మ‌న‌వ‌డి మ‌ధ్య విభేదాలు ఏంటి?

బాలీవుడ్ బ‌డా స్టార్స్ అమితాబ్ బ‌చ్చ‌న్, షారూఖ్ ఖాన్‌ల మ‌ధ్య మంచి బాండింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. బిగ్‌బీను ఆద‌ర్శంగా తీసుకొని షారూఖ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్య నందా, షారూఖ్ కూతురు సుహానే ఖాన్ కూడా మంచి ఫ్రెండ్సే. అడ‌పాద‌డాపా వీరు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌కు స‌ర్‌ప్రైజెస్ ఇస్తుంటారు. అయితే గ‌త కొద్ది రోజులుగా అగ‌స్త్య నందా పేరు సోష‌ల్ మీడియాలో చాలా ట్రెండింగ్‌గా మారింది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అగ‌స్త్య నందాకు కొద్ది గంట‌ల‌లోనే 48 వేల‌కు పైగా ఫాలోవ‌ర్స్ వ‌చ్చారు.

అగ‌‌స్త్యా నందాను ఫాలో అయ్యే వారిలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, అలియా భ‌ట్, క‌రిష్మా క‌పూర్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు ఉన్నారు. సోష‌ల్ మీడియాలోకి న్యూ ఎంట్రీ ఇచ్చిన కార‌ణం గా అగ‌స్త్యా ప‌లు ఫోటోలు షేర్ చేశాడు. దీనిలో ఒక పోస్ట్‌కు షారూఖ్ ఖాన్ కుమార్తె .. సుహానా ఖాన్ స్పందిస్తూ అన్‌ఫాలో అని కామెంట్ సెక్ష‌న్‌లో రాసింది. అగ‌స్త్త్యాకు మంచి స్నేహితురాలైన సుహానా అన్‌ఫాలో అని కామెంట్ పెట్ట‌డం వెనుక ఉద్దేశం ఏంటి అని నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఏవైన విభేదాలు తలెత్తాయా అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు.

అగ‌స్త్య షేర్ చేసిన మ‌రో పోస్ట్‌లో అదృష్టాన్ని న‌మ్ముతాను, కృషిని కాదంటూ ఓ ఫోటో షేర్ చేయ‌గా, దీనికి సోద‌రి న‌వ్యా నందా, అలియా భ‌ట్ లు కామెంట్స్ పెట్టారు. నీ ఉద్దేశం ఏంటో చెప్పాలంటూ వారు కోరారు. మొత్తానికి అగ‌స్త్య నంద సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, అగ‌స్త్య నందా తాత అమితాబ్ బ‌చ్చ‌న్ ఆరోగ్యంకు సంబంధించి రీసెంట్‌గా అనేక పుకార్లు షికారు చేయ‌గా, షారూఖ్ మ‌న్న‌త్ హౌజ్ అమ్మ‌బోతున్నాడంటూ రూమ‌ర్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. శ్వేతనందా, నిఖిల్ నందా కుమారుడైన అగ‌స్త్య ఇటీవ‌లే లండ‌న్‌లోని సెవెనోక్స్ స్కూల్ నుంచి పట్టభద్రుడ‌యిన విష‌యం తెలిసిందే