Jabardasth: సుడిగాలి సుధీర్ కు కరోనా? ఎప్పుడు సోకిందంటే?

sudigali sudheer tests corona positive?

జబర్దస్త్ అంటేనే సుడిగాలి సుధీర్.. సుడిగాలి సుధీర్ అంటేనే జబర్దస్త్. జబర్దస్త్ ప్రోగ్రామ్ తోనే సుధీర్ కు గుర్తింపు వచ్చింది. తనలోనూ మంచి కమెడియన్ తో పాటు నటుడు ఉన్నాడు. అందులోనూ రష్మీ, సుధీర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ మామూలుది కాదు. ఆ జంటకు ఉన్న క్రేజే వేరు. ఆ జంట ఏ షోలో ఉంటే ఆ షో సూపర్ హిట్ అయినట్టే.

sudigali sudheer tests corona positive?
sudigali sudheer tests corona positive?

జబర్దస్త్ తో పాటు ఢీషోలో కూడా సుడిగాలి సుధీర్ పాల్గొంటున్నాడు. మరోవైపు అడపా దడపా సినిమాలు కూడా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్.

అయితే.. తాజాగా సుధీర్ కు కరోనా సోకిందట. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. ఆయనకు కరోనా లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాడట. దీంతో సుధీర్ కు కరోనా పాజిటివ్ అని రిపోర్టుల్లో వచ్చినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అక్టోబర్ 18న సుధీర్ కు కరోనా వచ్చిందని.. వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉంటూ సుధీర్ చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే.. తనకు కరోనా సోకిందనే విషయం మాత్రం సుధీర్ అధికారికంగా చెప్పలేదు. సుధీర్ కు కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న సుధీర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సుధీర్ తొందరగా కరోనా మహమ్మారిని జయించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నారు.

ఒకవేళ సుధీర్ కు కరోనా వచ్చిందన్న వార్త నిజమే అయితే.. రష్మీ, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, శేఖర్ మాస్టర్, వర్షిణి, సంగీత, రోజా, మనో, మిగితా జబర్దస్త్ కంటెస్టెంట్లంతా టెస్టులు చేయించుకోవాల్సేందే కదా. వాళ్లు కూడా తమ శాంపిల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్లలో ఎవరికైనా కరోనా సోకిందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.