సుధీర్, రష్మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? లేదా? అనేది పక్కన పెడితే.. ఏ షో అయినా సరే వాళ్లిద్దరూ కలిస్తే రచ్చ రంబోలే ఇక. ఆ జంటకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది.
సుధీర్.. రష్మీని ప్రేమిస్తున్నాడని అందరికీ తెలుసు. రష్మీకి కూడా సుధీర్ అంటే ఇష్టం. కానీ.. తనను పెళ్లి చేసుకునే ప్రేమ మాత్రం కాదు. రష్మీకి ఇటీవలే పెళ్లి కూడా ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. ఓ బిజినెస్ మెన్ తో త్వరలోనే పెళ్లి జరగబోతోందని తెలిసింది. తనకు కాబోయే వాడిని కూడా తానే సెలెక్ట్ చేసుకున్నదని తెలిసింది.
అయితే.. అది ఇప్పుడు నిజమే అని స్పష్టమయింది. యాంకర్ రష్మీ..నిజంగానే వేరు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని మరోసారి రుజువయింది. అది కూడా జబర్దస్త్ స్టేజ్ మీదనే.
తన స్కిట్ నడుస్తుండగానే సుధీర్.. స్కిట్ లో భాగంగా.. యాంకర్ రష్మీని పెళ్లి చేసుకుందామంటే.. ఈ అడుక్కునే రష్మీని ఇచ్చి పెళ్లి చేశారు.. అంటూ సెటైర్లు వేస్తాడు.
సుధీర్.. మనం ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? జరగవు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా తనను మరిచిపోవాలనే హింట్ ఇచ్చిందా? రష్మీ అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ.. తనను పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి సుధీర్ బాగానే ట్రై చేశాడు. అయినా కూడా రష్మీ మనసు మాత్రం కరగలేదు. నన్ను పడేయడానికి ఎన్ని సాహసాలు చేశావు. ఎంతో ట్రై చేశావు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఇక నువ్వు నన్ను మరిచిపోవాల్సిందే అన్నట్టుగా రష్మీ సుధీర్ పై పంచ్ డైలాగ్ లు విసిరింది.
దీంతో.. వీళ్లిద్దరి ప్రేమాయణం ముగిసినట్టేనా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. రష్మీ పక్కన సుధీర్ ను తప్పించి వేరే వాళ్లను ఊహించుకోలేము.. అంటూ సుధీర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి..