దయచేసి అలా చేయకండి.. ప్రదీప్ కోసం సుధీర్ తాపత్రయం!

బుల్లితెరపై అనేక షోలు చేస్తూ సుధీర్, రష్మీ, ప్రదీప్, హైపర్ ఆది ఇలా కొందరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. పైగా మనకు కనిపించేది తెరపై కొంచెం. కానీ షూటింగ్ సెట్స్‌లో వారందరూ ఎంత సరదాగా ఉంటారు.. ఎంత ఎంజాయ్ చేస్తూ షూటింగ్‌లలో సందడి చేస్తుంటారు అందరికీ తెలియదు. అవసరమైనప్పుడు ఒకరినొకరు అండగా నిలుస్తూ మద్దతు ప్రకటిస్తుంటారు. అందుకే ఇప్పుడు ప్రదీప్ కోసం, అతని సినిమా కోసం ఇలా అందరూ ముందుకు వచ్చారు.

Sudigali Sudheer About Pradeep 30 Rojullo Preminchadam Ela
SudiGali Sudheer about Pradeep 30 Rojullo Preminchadam Ela

అయితే ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మరీ అంతగా గొప్పగా లేదని, పైగా వెండితెరపై అంత సేపు ప్రదీప్‌ను చూడటం కూడా కష్టమేనని, ఎంతైనా బుల్లితెరపై చేసిన మ్యాజిక్‌ను వెండితెరపై క్రియేట్ చేయలేకపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అది కాసేపు పక్కన పెడితే.. ప్రదీప్ కోసం సుధీర్ బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది.

మొన్న జరిగిని ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక సినిమ విడుదల సందర్భంగా ఓ పోస్ట్ కూడా చేశాడు. మా సొంత సోదరుడి లాంటి ప్రదీప్‌కు, ఆయన సినిమాకు, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ ది బెస్ట్.. అందరికీ విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. దయచేసి అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి.. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి సుధీర్ పోస్ట్ చేశాడు. మొత్తానికి ప్రదీప్ సినిమా హిట్టవ్వాలని బాగానే తాపత్రయ పడుతున్నట్టున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles