అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్న సుధీర్‌.. అసలేం జరిగిందంటే..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపుగా 7,8 సంవత్సరాల నుంచి జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా జబర్దస్త్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ షోలో ఫుల్ టైమ్ గా ఉంటూ సమయం దొరికినప్పుడు ఇతర షోలలో కనిపిస్తూ అప్పుడప్పుడూ వెండితెరపై నటుడిగా కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా కూడా పలు సినిమాలలో నటించిన సుధీర్ ప్రస్తుతం అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో సుధీర్ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు.

దీనితో అభిమానులు అసలు సుధీర్‌ ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ అభిమానులు సైతం జుట్టు పీక్కునే పరిస్థితి. ఒక వైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ కనిపిస్తున్నాడు. మరో వైపు వరుసగా సినిమాల్లో నటిస్తున్న కారణంగా షూటింగ్‌ ల్లో పాల్గొంటున్న కారణంగా జబర్దస్త్‌ లో ప్రస్తుతానికి కనిపించడం లేదు అని వినికిడి. ఇలాంటి సమయంలో వేరే ఛానల్ లో ఒక రియాల్టీ షో లో అనసూయ తో కలిసి యాంకరింగ్‌ చేస్తున్నాడు. ఇంత బిజీ అంటున్న సుధీర్‌ ఎలా ఆ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా సుధీర్‌ జబర్దస్త్‌ కాకుండా మరేం చేసినా కూడా జనాలు ఊరుకోవడం లేదు. ఢీ డాన్స్ షో నుంచి తప్పుకున్న తరువాత తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ మధ్య సుధీర్ మళ్ళీ జబర్దస్త్‌ లో కూడా కనిపించడం లేదు. రోజా వెళ్లి పోవడమే ఆలస్యం వెంటనే జబర్దస్త్‌ నుండి సుడిగాలి సుధీర్ కూడా వెళ్లి పోవడం చర్చనీయాంశంగా మారింది. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్‌ ను చేస్తానంటూ గతంలో సుధీర్ మరియు గెటప్‌ శ్రీను లు చెప్పి ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుండడంతో సుదీర్ ఏమి చేస్తున్నాడు అన్నది అర్థం కాక అభిమానులు గందరగోళంతో ఉన్నారు. అసలు సుధీర్‌ మళ్లీ జబర్దస్త్‌ లో వస్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ కావాలంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ విషయం పై సుడిగాలి సుదీర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి..