Suddaala Ashok Teja: నిజం చెప్పాలంటే తనకు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి మధ్య విబేధాలు లేవని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పుకొచ్చారు. తనకు ఆయన మీద, ఆయనకు తన మీద ఎలాంటి కోపం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ అంతకు పూర్వం ఉన్న సీనియర్ కవులు చేసిన ప్రయోగాలనే నేను చేశానని చెప్పడమే ఇక్కడ ముఖ్య అంశమని ఆయన అన్నారు.
ఇంకా వివరంగా చెప్పాలంటే సీతారామ శాస్త్రి గారు, నారాయణ రెడ్డి గారు, సముద్రాల గారు, వేటూరి గారు, మల్లాది గారు, పింగళి గారు ఇలా రాశారు. తాను కూడా ఆ దారిలో వెళ్తున్నానని చెప్పడమేనని ఇక్కడ జరిగేది అని ఆయన వివరించారు.అంతేకాకుండా తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో తనను ఆశీర్వదించిన కవి సిరివెన్నెల అని సుద్దాల గర్వంగా చెప్పారు.
తాను మొదటగా రాసిన పాటను కోదండపాణి స్టూడియోలో చూసి, వజ్రాలు పొదిగిన వడ్డాణమే తెచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా.. ఆ లైన్లు విని బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్ అని తనను పొగిడినట్టు అశోక్‌తేజ వివరించారు. వజ్రాలుతో ఉన్న వడ్డాణం పెడ్తానని అనకుండా వజ్రాలు పొదిగిన వడ్డాణం తీసుకొచ్చి నీ నడుముకు పూజ చేసుకుంటా అనే దాంట్లో చాలా అర్థం ఉంటుందని ఆయన అన్నట్టు సుద్దాల తెలిపారు. ఒక కవితాత్మకమైన సందేశం అది దాని అశోక్ పట్టుకున్నాడు. భవిష్యత్‌లో గొప్ప రైటర్ అవుతాడని అప్పట్లో సిరివెన్నెల, తన ఫస్ట్ పాట రికార్డింగ్ సమయంలో కోటి గారికి చెప్పారని సుద్దాల అశోక్ తేజ అన్నారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ ఆయన చాలా మంచి వారని ఆయన చెప్పారు.