అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న మందిర.. డిసెంబర్ 5న స్ట్రీమింగ్!

బాలీవుడ్ నటి సన్నీలియోన్ లీడ్ రోల్ లో నటించిన మందిర మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే వెండితెరపై ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అసలు చాలామందికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందని విషయం కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ సినిమాని డిసెంబర్ 5 నుంచి ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

ఈ విషయాన్ని ఆహా టీం సోమవారం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సన్నీ తో గేమ్ సరదా కాదు, జాగ్రత్త. మందిర, ఆహ లో డిసెంబర్ 5న ప్రీమియర్ కానుంది అనే క్యాప్షన్ తో సహా ఆహా వీడియో ఈ విషయాన్ని తెలిపింది. సన్నీ లియోన్ రెండు పాత్రలలో నటించిన ఈ హర్రర్ కామెడీ సినిమాలో యోగి బాబు, సతీష్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించారు.

ఆర్ యువన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కి జావేద్ రియాజ్ సంగీతం అందించారు. గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి యువరాణి ఆయన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది, అసలు ఆమె కథ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మందిర అనే దెయ్యం పాత్రలో సెక్సీ బాంబు సన్నిలియోన్ నటించడం విశేషం.

దెయ్యం రోల్ తో పాటు ఆమెకు అలవాటైనా గ్లామరస్ రోల్ లో కూడా చూపించారు మూవీ మేకర్స్. ఈ సెక్సీ బాంబుతో మంచి సక్సెస్ ని అందుకోవాలని భావించిన చిత్ర యూనిట్ కి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. థియేటర్లలో పెద్దగా ఆదరణ లేని ఈ సినిమాని 13 రోజుల్లోనే ఆహా వీడియో ద్వారా ఓటిటి ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమాని మీరు ఓటీటీ లో వీక్షించవచ్చు.