ఏంటి “సలార్” షూట్ ఇంకా బాలన్స్ ఉందా??

prabhas_salaar_prashanth_neel_shoot_

ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ లో ఉన్న భారీ చిత్రాల్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ కూడా ఒకటి కాగా ఈ చిత్రం కోసం ఐతే ఇప్పుడు ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మరి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ డిసెంబర్ విడుదలకి సిద్ధం కాగా..

ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మెయిన్ గా గ్రాఫిక్స్ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటుంది అట. కాగా అది కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నారు. అయితే ఇది అంతా ప్రభాస్ లేని కొన్ని చిన్నా చితకా ఇంపార్టెంట్ సీన్స్ అట.

వీటిని కూడా పనిలో పని అని దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీం కంప్లీట్ చేస్తున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీఎఫ్ సినిమా మేకర్స్ ఈ సినిమాని కూడా నిర్మాణం వహిస్తున్నారు అలాగే దీనిని కూడా భాగాలుగానే నిర్మాణం వహిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారని టాక్ ఉంది.