స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో పెద్ద వెలితి మెగాస్టార్ ..కారణం పెద్దదే ..!

ఇటీవలే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజైంది. భాగమతి సినిమా వంటి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు థియోటర్స్ లో రిలీజ్ అవుతుందని జనాలని ఊరించి ఊరించి పరిస్థితులు అనుకూలించక ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకి ఏమాత్రం చేరుకోలేకపోయింది. ముఖ్యంగా అనుష్క నుంచి ఏదో ఊహించుకుంటే ఆ ఊహించకున్న దాంట్లో సగం కూడా తృప్తి చెందలేకపోయారన్న కామెంట్స్ వచ్చాయి.

ప్రస్తుతం అనుష్క నెక్స్ట్ సినిమా ఏంటన్నది పెద్ద డైలమాలో పడింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే వరసగా సినిమాలు కమిటయ్యేదేమో.. కాని ఇప్పుడు నిశ్శబ్ధం అనుష్క ని ఆలోచనలో పడేసిందని అంటున్నారు. అయితే తమిళం లో మాత్రం గౌతం వాసుదేవ్ మీనన్ – కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కబోయో ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ లో అనుష్క నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. మరి నిశ్శబ్ధం రిజల్ట్ తర్వాత మేకర్స్ అనుష్క నే ఫైనల్ చేసుకుంటారా .. లేక డెసిషన్ మార్చుకుంటారా చూడాలి.

అయితే కొంతమంది ఈ సీనియర్ హీరోయిన్ ఇక సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తుందని కూడ మాట్లాడుకుంటున్నారట. సక్సస్ ఫుల్ గా 15 ఏళ్ళలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన అనుష్క ఇక పెళ్ళి చేసుకొని సినిమాలకి గుడ్ బాయ్ చెప్పాలనుకుంటుందని సమాచారం. అయితే ఇంత పెద్ద లాంగ్ జర్నీ లో అనుష్క సినీ కెరీర్ మొత్తం లో ఏదైనా డిసప్పాయింట్‌మెంట్ ఉందంటే అది మెగాస్టార్ తో హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చేసే అవకాశం రాకపోవడమే. ఇప్పుడు ఇదే టాపిక్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారట.

స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అంతే మళ్ళీ చిరంజీవి గత చిత్రం సైరా లో గెస్ట్ రోల్ లో కనిపిచింది. కాని చిరంజీవి తో నటించాలని ఫ్యాన్స్ చాలా సందర్భాలలో అనుకున్నారు. అనుష్క కి ఆ అవకాశం వస్తే వదిలేది కాదు. కాని అదే ఇప్పుడు ఒక వెలితిగా మిగిలిపోతుందని అంటున్నారు. కాస్త అటు ఇటు గా అనుష్క తో పాటే కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ మాత్రం మెగాస్టార్ తో హీరోయిన్ గా రెండవ సినిమా చేస్తోంది.