వందల కోట్లు సంపాదించిన తలైవా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ నాట అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తమిళ తలైవాగా పేరు సంపాదించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన రజినీ కాంత్ ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో అధిక మొత్తంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే అధికారులు రజనీ కాంత్ ను సత్కరిస్తూ అభినందించారు.

ఈ విధంగా తమిళ ఇండస్ట్రీలో నుంచి అధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తి గా రజనీ నిలవడంతో ప్రతి ఒక్కరు ఈయన ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో కోట్లు సంపాదించినప్పటికీ ఆయన ఎంతో సాదాసీదాగా కనిపిస్తారు. అయితే ఈయన కూడా ఖరీదైన ఇల్లు కార్లు బంగ్లాలు కొనుగోలు చేశారు. ఇకపోతే పలు సర్వేల ప్రకారం రజనీకాంత్ నికర ఆస్తులు విలువ సుమారు 400 కోట్లు ఉంటుందని అంచనా.

ఇకపోతే రజనీకాంత్ స్థిరచరాస్తుల విషయానికి వస్తే ఈయనకు పోలీస్ గార్డెన్ లోనే ఎంతో ఖరీదైన ఇల్లు ఉందని తెలుస్తోంది.ఈ ఇంటి విలువ 35 కోట్లు అలాగే తన గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి ఈ కార్లు సుమారు 30 కోట్ల వరకు విలువ చేస్తాయని సమాచారం. ఈ విధంగా రజనీకాంత్ తన హస్తిరచరాస్తులు కూడా వందల కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇలా వందల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఈయన ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ చెల్లించే వ్యక్తిగా ఈ ఏడాది నిలవడం గమనార్హం.