Murugadas: తమిళ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా మురుగదాస్ కొనసాగారు. ఈయనకు తమిళనాట నే కాక తెలుగులో కూడా మంచి విజయాలు ఉన్నాయి. గజిని, సెవెంత్ సెన్స్, తుపాకీ, కత్తి వంటి సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. మురుగదాస్ ,మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన ‘స్పైడర్’ మాత్రం నిరాశపరిచింది. అయితే ఈమధ్య ఆశించిన విజయాలు రాకపోవడంతో మురుగుదాస్ హవా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు శంకర్ తర్వాత తమిల్ చలన చిత్ర పరిశ్రమలో నూరు కోట్ల సినిమాలను అందించగల దర్శకుడిగా పేరు పొందాడు. అంతేకాదు అపజయాలతో ఇమేజ్ కోల్పోతున్న విజయ్ లాంటి హీరోకు తుపాకీ,కత్తి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి తన ఇమేజి అమాంతం పెంచేసింది ఘనత కూడా ఆయనకే దక్కింది. దీంతో మురుగదాస్ ఇమేజ్ కూడా అమాంతం పెరగడం, రెమ్యునరేషన్ కూడా పెంచడం జరిగింది.ఈయన తీసే సినిమాలకి కాపీ ఆరోపణలు రావడం, కేసులు నమోదవ్వడం, దాంతో ఎన్నో వివాదాలు ఏర్పడడం వంటివి జరగడంతో మురుగదాస్ ఇమేజ్ కాస్త డౌన్ అయ్యింది. దానికి తోడు ఆయన మహేష్ బాబు తో తీసిన ‘స్పైడర్’, ఇంకా’దర్బార్’ సినిమాలు కూడా ఘోర పరాజయాలు చవిచూడడం వంటివి కూడా ఈయన స్టార్ స్టేటస్ ను దెబ్బ తీశాయి. ప్రస్తుతం ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
టాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ ప్రభాస్ వంటి సినిమాలను కలిసి కథ వివరించిన వారు ఓకే చేయలేదని సమాచారం. టాలీవుడ్ లోనే కాదు కన్నడ సినీ పరిశ్రమలో కూడా చేదు అనుభవమే ఎదురైంది. కేజీఎఫ్ తో స్టార్ ఇమేజ్ పొందిన యష్ కూడా బిజీగా ఉండటంతో తనకు ఓకే చెప్పలేదని సమాచారం. ఇక తమిళనాట అయితే స్టార్ హీరోలే కాదు,మిడ్ రేంజ్ హీరోలు కూడా మురుగదాస్ వైపు చూడటం లేదట.