విడాకులు రద్దు చేసుకుంటున్న స్టార్ కపుల్స్.. సంతోషంలో అభిమానులు!

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల తీసుకొని ఒకరికి ఒకరు దూరం అవుతున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎన్నో ఏళ్ళు సంతోషంగా జీవించిన జంటలు కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి విడాకులు వరకు వెళ్తున్నారు. ఇలా విడాకులు తీసుకున్న సెలబ్రెటీ కపుల్స్ లో ధనుష్ ఐశ్వర్య జంట కూడా ఒకటి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎంతోకాలం సంతోషంగా జీవించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరూ వారి విడాకులు రద్దు చేసుకొని మళ్లీ కలిసిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఐశ్వర్య ధనుష్ తమ విడాకులు రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న వీరిద్దరూ వారి పిల్లల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని వారి విడాకులను రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంలో కౌన్సిలింగ్ తీసుకున్న ఈ స్టార్ కపుల్స్ ఎట్టకేలకు పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ ఒకటి కానున్నారు. దీంతో ఐశ్వర్య ధనుష్ కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొందర్లోనే వీరి విడాకుల రద్దు విషయం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.