వామ్మో.. ఒక రోజుకి రమ్యకృష్ణ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా?

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింన రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రమ్య కృష్ణ తన హావ భావాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రమ్య కృష్ణ హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడి విలన్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ దేవత పాత్రలలో కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

రమ్య కృష్ణ దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. అయితే అలా హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ ఒక వెలుగు వెలిగిన రమ్య కృష్ణ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్య కృష్ణ నటన అద్భుతంగా ఉంది. ఈ పాత్రలో ఆమె హుందాతనం ఉట్టిపడింది. ఇటీవల బంగార్రాజు సినిమాలో కూడా రమ్య కృష్ణ నటించింది. ఈ సినిమాలో రమ్య కృష్ణ హీరోయిన్ కి పోటీగా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు, తమిళ భాషలలో కీలక పాత్రలలో నటిస్తూ రమ్య కృష్ణ చాలా బిజీగా ఉన్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రమ్య కృష్ణ తన రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసింది. ప్రస్తుతం ఈవిడ ఒక రోజుకి 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందని వార్తలు వినిపస్తున్నాయి. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రమ్య కృష్ణ రోజుకి స్టార్ హీరోయిన్స్ కన్నా ఎక్కువగా పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్నారు.