Home News విజయ సేతుపతి సినిమా షూటింగ్ మధ్య నుండి వెళ్ళిపోయిన శ్రుతిహాసన్

విజయ సేతుపతి సినిమా షూటింగ్ మధ్య నుండి వెళ్ళిపోయిన శ్రుతిహాసన్

కరోనా వల్ల చిత్ర పరిశ్రమ దారుణంగా దెబ్బతినింది, పరిశ్రమని నమ్ముకుని ఉన్న చిన్న మధ్య నటీనటులు మరియు శ్రామికులు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. దాదాపు అయిదు ఆరు నెలలు షూటింగ్ లు జరగలేదు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ల సందడి కొనసాగుతుంది. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు జరుపుకుంటున్నారు. ఔట్ డోర్ షూటింగ్ అంటే ఖచ్చితంగా జనాలు వందల సంఖ్యలో వస్తారు. కాని ఈ సమయంలో అంత మంది జనాలు వస్తే చాలా ప్రమాదం. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. జనాలు రాని చోట షూటింగ్ చేసుకోవాలి. లేదంటే జనాలు రాకుండా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని శృతి హాసన్.. విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కుతున్న తమిళ సినిమా షూటింగ్ స్పాట్ కు వందల మంది జనాలు ఒక్క సారే రావడంతో గందరగోళం ఏర్పడిందట.

Sruthihasan Went Out From The Middle Of New Movie Shooting
Shruthi hasan

అంత మంది ఒక్కసారే చూసేందుకు ఎగబడి రావడంతో శృతి హాసన్ చిత్ర యూనిట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా అంటూ అసహనంగా అక్కడ నుండి వెళ్లి పోయింది. షూటింగ్ మద్యలో శృతి హాసన్ వెళ్లి పోవడంతో ఒకటి రెండు షాట్ లు ఆమె లేకుండా చిత్రీకరించి పేకప్ చెప్పేశారట.షూటింగ్ నుండి అర్థాంతరంగా వెళ్లి పోవడంపై శృతి స్పందిస్తూ.. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా కీలకం. కరోనా ఇంకా పోలేదు… ప్రతి ఒక్కరు కూడా ప్రొటోకాల్ పాటించాల్సిందే. అలా చేయకుంటే మహిళగా నా జాగ్రత్త నేను తీసుకుంటా అందుకే షూటింగ్ మద్యలో నుండి వచ్చానంటూ తన ప్రవర్తను సమర్థించుకుంది. యూనిట్ సభ్యులు ఆమె తీరును ఇప్పటి వరకు తప్పుపట్టలేదు. తమిళ మీడియాలో ఈ విషయంపై రకరకాలుగా కధనాలు ప్రముఖంగా ప్రచురితమవుతున్నాయి.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News