స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు సినిమా పేరు అదేనా ?

స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైంది. దీంతో అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన వార్తను రామ్‌ చరణ్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు మార్చి 20న ప్రకటించనున్నారట. ఆరోజే పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్‌ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. కియారా అడ్వాణీ హీరోయిన్‌. దీని షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.