‘పుష్ప 2’లో మరో కొత్త క్యారెక్టర్….

నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ అంటే తెలుగు, మలయాళం మాత్రం క్రేజ్ ఉండేది. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. యూట్యూబ్ లో హిందీ లో దుబ్బింగ్ అయిన అల్లు  అర్జున్ సినిమాలు కొంత క్రేజ్ తీసుకొచ్చాయి కానీ అల్లు అర్జున్ సినిమాల్ని థియేటర్ లో చూసే అంత కాదు. కానీ ‘పుష్ప’ హిట్ తో అల్లు అర్జున్ ఫేట్ మారిపోయింది.

ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ మొదలుకాబోతుంది. దీని పై ఇప్పటినుండే చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండబోతుందని అది  సినిమా క్లైమాక్స్ లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్ ‘ పుష్ప 3’ కి లీడ్ అవుతుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ తో బాటు ఇంకో పవర్ఫుల్ రోల్ కోసం విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఫైనల్ చేస్తారని వార్తలు వచ్చాయి. అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి, కానీ వీటి పై ఎలాంటి క్లారిటీ రాలేదు.