గోవాలో రచ్చ.. శ్రీముఖి, అరియానా, విష్ణుప్రియ హల్చల్

Sriukhi Ariyana and Vishnu Priya In Goa

శ్రీముఖి, విష్ణుప్రియ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి విష్ణుప్రియలు ఎక్కడికైనా వెకేషన్స్‌కు వెళ్లాలంటే పక్కన శుశ్రుత్, ఆర్జే చైతు ఉండాల్సిందే. ఆ మధ్య బిగ్ బాస్ ఇంటి నుంచి శ్రీముఖి వచ్చాక.. అందరూ కలిసి మాల్దీవుల్లో ఎంత రచ్చ చేశారో అందరూ చూశాం. బిగ్ బాస్ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని శ్రీముఖి అక్కడ తీర్చేసుకుంది. అలా ఈ నలుగురు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వీరి గ్యాంగ్‌లో ఇంకో ఇద్దరూ జాయిన్ అయ్యారు.

Sriukhi Ariyana and Vishnu Priya In Goa
Sriukhi Ariyana and Vishnu Priya In Goa

బిగ్ బాస్ షోకు వెళ్లక ముందు నుంచే శ్రీముఖి గ్యాంగ్‌లో అవినాష్ జాయిన్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ తరువాత అరియానా కూడా శ్రీముఖి గ్యాంగ్‌లో మెంబర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆరుగురు కలిసి సోషల్ మీడియా టాప్ లేపుతున్నారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్ గోవాలో దుమ్ములేపుతోంది. బీచ్‌లు, రిసార్ట్స్, రెస్టారెంట్లంటూ రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీముఖి, అరియానా డ్రెస్సులు షాకింగ్‌గా ఉన్నాయి.

బుల్లి నిక్కర్లో అరియానా రచ్చ చేయగా.. శ్రీముఖి మాత్రం పొట్టి డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇక విష్ణుప్రియ సంగతి చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఈ గ్యాంగ్ మాత్రం గోవా టూర్‌ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ గోవా టూర్‌ను ఎన్ని రోజులు ప్లాన్ చేశారో గానీ మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వీరి ఫోటోలో వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు వీరంతా కామెడీ స్టార్స్, బిగ్ బాస్ ఉత్సవం షోలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.