Srinidhi shetty : కేజీఎఫ్ 2 హీరోయిన్ కు క్రేజీ హీరో నుండి ప్రశంసలు….!

Srinidhi Shetty : కేజీఎఫ్ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయి ఇండియా బాక్స్ ఆఫీస్ ను బద్దలుకొట్టింది. ఇక బాలీవుడ్ లో ఒక కన్నడ హీరోకు చాలా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను గుర్తింపు ను తెచ్చిపెట్టింది కేజీఎఫ్ సినిమా. రెండో పార్ట్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలయి బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఏమాత్రం జాలి లేకుండా మిగిలిన సినిమాలను నలిపేస్తోంది.

కేజీఎఫ్ 2 విడుదలయ్యాక ప్రేక్షకులనుండి ఇంత భారీ స్పందన వస్తోందో అంతే స్థాయిలో సెలబ్రిటీలు కూడా సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు యష్ కు ఇంకా ప్రశాంత్ నీల్ కు అభినందనలు తెలుపుతున్నారు. మహేష్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు యష్ కు మరియు ప్రశాంత్ ను అభినందించారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కూడా బాగా గుర్తింపు పొందింది.

ఇక పోతే సలార్ స్టార్ ప్రభాస్ మాత్రం యష్ ప్రశాంత్ నీల్ తో పాటు ఈ సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి ని ప్రశంసించారు. సినిమాలో ఆమె పాత్రకు తగిన న్యాయం చేసారంటూ పొగుడుతున్నాడట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ లోని సూరికి ఫోన్ చేసి చెప్పారట. హీరోయిన్ గా తన పాత్రకు న్యాయం చేసిందని, తన నటన అద్భుతంగా ఉందని తెలిపారని శ్రీనిధి స్వయంగా తెలిపింది. ఇందుకు ఫుల్ ఖుషీ అవుతూ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రభాస్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆనందంలో మునిగితేలుతోంది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న కోబ్రా చిత్రంలో నటిస్తోంది. మున్ముందు మరిన్ని సినిమాలతో అలరించనుంది.