శ్రీముఖిలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా.. వీడియో వైరల్

Sreemukhi Sings In SA RE GA MA PA The Next Singing ICON SHow

బుల్లితెరపై రాములమ్మగా శ్రీముఖి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. బుల్లితెరపై పటాస్ షోతో స్టార్ యాంకర్‌గా ఎదిగింది. ఆ షోలో వచ్చిన క్రేజ్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీఇచ్చేలా చేసింది. అయితే బిగ్ బాస్ షో వల్ల శ్రీముఖి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఎంత స్థాయిలో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అంతే స్థాయిలో నెగెటివిటీని మూటగట్టుకుంది. బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి బుల్లితెరకు కాస్త దూరంగా ఉంది.

Sreemukhi Sings In SA RE GA MA PA The Next Singing ICON SHow
Sreemukhi Sings In SA RE GA MA PA The Next Singing ICON SHow

పటాస్ ఆఫర్ మళ్లీ వచ్చినా కూడా చేయలేదు. అలాంటి షోలు చేయలేనని చెప్పేసింది. ఆ తరువాత స్టార్ట్ మ్యూజిక్ ప్రీ లోడెడ్ అంటూ కొత్త షోతో ముందుకు వచ్చింది. అది అంతగా వర్కవుట్ కాలేదు. అయితే మళ్లా చాలా రోజులు గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యే బొమ్మ అదిరింది షోలో యాంకర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి రాకతో బొమ్మ అదిరింది షో ఇమేజ్ కూడా బాగానే మారింది. ప్రస్తుతం శ్రీముఖి తనలోని కొత్త కోణాన్ని బయటకు తెచ్చింది.

సింగింగ్ ఐకాన్ దీపావళి సెలెబ్రేషన్స్‌లో శ్రీముఖి స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. కోటి, చంద్రబోస్, ఎస్పీ శైలజ న్యాయ నిర్ణేతలుగా ఉన్న సరిగమప సింగింగ్ ఐకాన్ షోలో శ్రీముఖి పాట పాడింది. ఆపాటను విన్న కోటి షాక్ అయ్యాడు. దివాళీ దీపాన్ని అంటూ మత్తెక్కించేలా శ్రీముఖి పాడిన పాటను అందరూ ప్రశంసించారు. మొత్తానికి శ్రీముఖి తనలోని గాత్రాన్ని, గాయనిని బయటకు తీసుకొచ్చింది.