Sreemukhi : జిగేల్ రాణిగా మారిన శ్రీముఖి.. బాగానే ఊపేస్తోందిగా వైర‌ల్ వీడియో..!

Sreemukhi Rehearsals For Bomma Adirindi Show Video

రాములమ్మ శ్రీముఖి డ్యాన్సులు ఇరగదీస్తుందన్న సంగతి తెలిసిందే. పటాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది శ్రీముఖి. తన రాములమ్మ సిగ్నేచర్ స్టెప్‌తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో శ్రీముఖికి కాస్త నెగెటివిటీ పెరిగింది. అయితే అప్పటి వరకు వృత్తి పరంగా ప్రేమించే అభిమానులు ఉండగా.. బిగ్ బాస్ షో ద్వారా వ్యక్తిగతంగా అభిమానించే వారు దొరికారు.

Sreemukhi Rehearsals For Bomma Adirindi Show Video
Sreemukhi Rehearsals For Bomma Adirindi Show Video

బిగ్ బాస్ తరువాత శ్రీముఖి కాస్త దూకుడు తగ్గించింది. అడల్డ్ కామెడీల జోలికి వెళ్లడం మానేసింది. తన అభిమానులు గర్వపడేలా చేస్తానని, వారికి నచ్చినవే చేస్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. శ్రీముఖి కొత్త షోలతో మెప్పించేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. ఆ మధ్య స్టార్ట్ మ్యూజిక్ అంటూ ఓ షోను చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం వుమెనియా అంటూ ఓ టాక్ షో చేస్తోంది. అది బాగానే క్లిక్ అయినట్టు కనిపిస్తోంది.

తాజాగా శ్రీముఖి చేతిలో బొమ్మ అదిరింది అనే మరో షో వచ్చి పడింది. నేటి రాత్రి ప్రారంభం కానున్న బొమ్మ అదిరింది షోలో శ్రీముఖి యాంకరింగ్‌ను ఇరగ్గొట్టేశేలా కనిపిస్తోంది. ఇందుకు కోసం డ్యాన్స్‌లు కూడా బాగానే వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రిహార్సల్స్‌లో ఎంత బాగా కష్టపడిందో ఓ వీడియో ద్వారా చూపించింది. జిగేల్ రాణి పాటకు శ్రీముఖి ఓ ఊపు ఊపేసినట్టు తెలుస్తోంది. మరి షోలో శ్రీముఖి ఎంత సందడి చేయనుందో చూడాలి.