యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెర రాములమ్మగా, బిగ్ బాస్ లౌడ్ స్పీకర్‌గా శ్రీముఖి ఫుల్ హల్చల్ చేస్తూ ఉంటుంది. శ్రీముఖి నోరు తెరిచిందంటే చాలు సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. బిగ్ బాస్ షో మూలానా శ్రీముఖి అరుపులకు ఎంతో మంది కర్ణబేరిలు పోయి ఉంటాయి. ఆమె వాయిస్‌పై వచ్చినన్నీ మీమ్స్, ట్రోలింగ్స్ మరేతర కంటెస్టెంట్లపై వచ్చి ఉండవు. చివరకు నాగార్జున కూడా శ్రీముఖి వాయిస్‌పై సెటైర్లు వేసేవాడు.
శ్రీముఖి వాయిస్ అంటే అందరూ భయపడే స్థాయికి వచ్చేశారు. ఆమె తెరపై కనిపిస్తే చాలు మ్యూట్‌లో పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఏకంగా లౌడ్ స్పీకర్ అంటూ బిగ్ బాస్‌లో ఓ అవార్డును కూడా ఇచ్చారు. అలా శ్రీముఖి వాయిస్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. దానిపై తాజాగా వచ్చిన ఓ మీమ్‌ను చూసి శ్రీముఖి చేతులెత్తి దండం పెట్టేసింది.
డార్లింగ్ సినిమాలో చంద్రమోహన్‌తో, ప్రభాస్ సీన్‌ను మీమ్‌గా రూపొందించారు. అందులో ఒక ఈవెంట్ ఉంది… మైక్, స్పీకర్స్ లేకుండా అందరికీ వినిపించేలా మాట్లాడే ఓ యాంకర్ కావాలి.. అని ప్రభాస్ చెప్పినట్టుగా పేర్కొన్నారు. అయితే శ్రీముఖిని యాంకర్‌గా పెడుదాం అని చంద్రమోహన్ చెప్పినట్టు మీమ్‌లో చూపెట్టాడు. అదీ శ్రీముఖి వాయిస్ అంటే.. అని చివర్లో కంక్లూడ్ చేశారు. ఇక ఆ మీమ్‌ను చూసిన శ్రీముఖి నవ్వుతూ.. నమస్కారం అని చెబుతూ దండం పెట్టేసింది. ఇలా శ్రీముఖి వాయిస్‌ను ట్రోల్ చేయడం ఇంకా మానడం లేదు. ఈ మధ్యే బొమ్మ అదిరింది షోలో యాంకర్‌గా శ్రీముఖి రచ్చ రచ్చ చేసింది.