హెడ్డింగ్ చూడటంతో అందరూ షాక్ అయి ఉంటారు. బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన ఈ ఇద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కాబోతోన్నారా అని ఆశ్చర్యం, అనుమానం, ఆనందం ఇలా అన్నీ ఒకే సారి వచ్చి ఉంటాయి. అయితే వీరిద్దరూ ఒకటి కాబోతోన్నారు. చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి అంటూ శుభలేఖ కూడా కొట్టించేశారు. అయితే ఇదంతా రియల్ లైఫ్ కోసం మాత్రం కాదు జీ తెలుగు దసరా ఈవెంట్ కోసమేనట.
జీతెలుగు, ఈటీవీ, స్టార్ మా చానెళ్లు ఎంతగా పోటీ పడుతున్నాయో అందరికీ తెలిసిందే. దసరా దీపావళి సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ మూడు చానెల్స్ స్పెషల్ ఈవెంట్లతో దంచి కొడుతున్నాయి. ఇప్పటికైతే ఈటీవీలో అక్కా ఎవరో అతగాడు అనే ఈవెంట్ ప్రోమోలతోనే ట్రెండ్ సృష్టిస్తోంది. తాజాగా స్టార్ మా వాళ్లు వంటలక్కను దింపారు. అమ్మోరుగా ప్రేమీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపారు.
ఇక జీ తెలుగు వాళ్లు యాంకర్ ప్రదీప్ పెళ్లిని క్యాచ్ చేసుకున్నారు. ప్రదీప్-శ్రీముఖికి పెళ్లంటూ ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ మేరకు ఓ శుభలేఖను కూడా పోస్ట చేశారు.దీంతో ఈ ఇద్దరు యాంకర్ల ఫ్యాన్స్ సంబర పడిపోతోన్నారు. విరుష్క, చైసామ్ లాగా వీరు కూడా ప్రముఖి అని ఓ హ్యాష్ ట్యాగ్‌తో హల్చల్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరి జంట ఎంతలా కెమిస్ట్రి పండిస్తారో చూడాలి.