రాత్రి 9.30 అయిందంటే ప్రేక్షకులు బుల్లితెరకు అతుక్కుపోతున్నారు. బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేమలు, కొట్లాటలు, అలకలు, ఆరోపణలతో షోపై మరింత ఆసక్తి పెరుగుతుండగా, పలువురు సెలబ్రిటీలు కూడా దీనిపై తమ స్పందన తెలియజేస్తున్నారు. ఎవరు విన్నర్ అవుతారు, టాప్ 5లో ఎవరుంటారు అనే లీకులని నెటిజన్స్ చెవిన వేస్తున్నారు. అయితే సీజన్3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి బిగ్ బిస్ జంటల గురించి మాట్లాడిన వీడియోని తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ..బిగ్ బాస్ హౌజ్‌లో మీ ఫేవరేట్ కనెక్షన్స్ ఎవరో కామెంట్ సెక్షన్‌లో తెలపండి అని పేర్కొంది.
శ్రీముఖి మాట్లాడుతూ.. బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో చాలా టాక్ జరుగుతుంది. అందరు ముఖ్యంగా మాట్లాడుకునేది వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, కనెక్షన్ గురించి. డే 1 నుండి అఖిల్, మోనాల్ మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. ఎవరేమనుకున్నా ఎఫెక్ట్ కావడం లేదు. ఇక అభిజిత్ అండ్ హారిక ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ టాస్క్ సమయంలో ఇన్ఫ్లూయెన్స్ కాకుండా ఇండివిడ్యుయల్‌గా ఆడుతున్నారు. ఇక మూడో జంట అవినాష్ – అరియానాలు కామెడీ- ఎంటర్‌టైన్‌మెంట్-ఎమోషనల్ బాండ్‌తో ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. మరి హౌజ్‌లో మీ ఫేవరేట్ కనెక్షన్స్ ఎవరో నాకు చెప్పండి అని పేర్కొంది శ్రీముఖి
గత సీజన్స్‌లో పోలిస్తే ఈ సీజన్‌లో కనెక్షన్స్ ఎక్కువయ్యాయి. ప్రస్తుం మూడు జంటల మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుండగా, రానున్న రోజులలో ఈ పరిస్థితి ఉండకపోచ్చనే అనుమానాలు వస్తున్నాయి. రోజులు పెరుగుతున్న కొద్ది, కంటెస్టెంట్స్ తగ్గుతున్న కొద్ది రిలేషన్స్ ని కొద్ది సేపు పక్కన పెట్టి గేమ్‌ని సీరియస్ గా ఆడాల్సిన పరిస్థితి తప్పక వస్తుంది. ఇప్పటికే అఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ మోనాల్‌ని తొలిసారి నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక రానున్న రోజులలో ఇంకేమి జరుగుతాయో చూడాలి.