బుల్లితెరపై సత్తా చాటుతూనే అడపాదడపా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న లౌడ్ స్పీకర్ శ్రీముఖి. పటాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా నిలిచి తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోస్‌తో బిజీగా ఉంటున్న శ్రీముఖి ప్రస్తుతం ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకి గౌతమ్ ఈవీఎస్ దర్శకుడు. శ్రీముఖి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీముఖితో పాటు మాయ నెల్లూరి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
దితిప్రియ భట్టాచార్య, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. చిత్ర కథ నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలుస్తుండగా, ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయకపోయిన ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలిపారు దర్శక నిర్మాతలు. గతంలో ఎప్పుడు చూడని విధంగా శ్రీముఖి ఈ సినిమాలో కనిపించనుందట
శ్రీముఖి కెరియర్ ఈ సినిమా తర్వాత గాడిన పడడం ఖాయమని అంటున్నారు . సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్ . డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇండియాలో ఎంఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ ఎక్స్‌ట్రీమ్, వీఐ మూవీస్‌లలో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. థియేటర్‌లో మూవీ విడుదలవుతుందని ఆమె అబిమానులు భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.