శ్రీముఖి కళాఖండాలు.. వీడియో వైరల్

Sreemukhi Instagram reel video

బుల్లితెరపై శ్రీముఖి ఎంత సందడి చేస్తుందో.. దానికి వంద రెట్ల ఎంటర్టైన్మెంట్‌ను సోషల్ మీడియాలో ఇస్తుంది. అలా శ్రీముఖి సోషల్ మీడియాకు చేసే హడావిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆమెకు ఆ స్థాయిలో ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుంది. శ్రీముఖి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా శ్రీముఖి తన స్నేహితురాలు విష్ణుప్రియతో కలిసి ఆమె చేసే వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Sreemukhi Instagram reel video
Sreemukhi Instagram reel video

శ్రీముఖి, విష్ణుప్రియలు కలిసి డ్యాన్స్ చేసే వీడియోలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. బుల్లితెరపై క్లోజ్ ఫ్రెండ్స్‌గా శ్రీముఖి, విష్ణుప్రియలకు మంచి పేరుంది. ఈ ఇద్దరూ కలిసి వీకెండ్‌లకు, వెకేషన్లకు వెళ్లినప్పుడు డ్యాన్స్‌లు చేస్తు హల్చల్ చేస్తుంటారు. అలా తాజాగా శ్రీముఖి చేసిన ఓ వీడియోపై విష్ణుప్రియ కామెంట్ చేసింది. ఇందులో శ్రీముఖి తన నట విశ్వరూపాన్ని చూపించేసింది.

సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌లంటూ ఇండస్ట్రీలో కొంత మంది పేర్లు వినిపిస్తుంటాయి. శ్రీముఖి కూడా ఆ క్యాటగిరీలో చేరాలని అనుకుంటుందో ఏమో. తాజాగా శ్రీముఖి ఇన్ స్టాలో రీల్ వీడియో చేసింది. కొన్ని కొన్ని సింగిల్ టేక్ కళాఖండాలు.. డ్రాఫ్ట్స్ నుంచి విముక్తి అంటూ ఎప్పుడో దాచిన వీడియోలను ఇలా బయటపెట్టేసిందట. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ టిక్ టాక్ స్టైట్లో కౌంటర్ వేసింది. శ్రీముఖి పోస్ట్‌పై విష్ణుప్రియ స్పందిస్తూ పగలబడి నవ్వేసింది.