ఎన్ని స్టోరీలు చెబుతావో చెప్పు.. జానీ మాస్టర్ గుట్టు విప్పిన శ్రీముఖి

Sreemukhi Fun With Jani Master In Bomma Adhirindi Set

జానీ మాస్టర్ వెండితెరపై స్టార్ హీరోలకు కంపోజ్ చేసే స్టెప్పులు ఎంత ఫేమస్సో.. బుల్లితెరపై వేసే పంచ్‌లు అంత ఫేమస్. ప్రస్తుతం జానీ మాస్టర్ బొమ్మ అదిరింది షోలో సందడి చేస్తున్నాడు. ఆ షోలో జానీ వేసే పంచ్‌లు, స్టెప్పులు బాగానే ఫేమస్ అవుతుంటాయి. అక్కడ డ్యాన్సర్ పండు, యాంకర్ శ్రీముఖితో కలిసి చేసే స్కిట్ బాగానే వర్కవుట్ అవుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ తెరపై మనకు కనిపించేవి. కానీ షో తెర వెనుక ఏం జరుగుతుంది.. ఎలా జరుగుతుందో దాదాపు చాలా మందికి తెలియదు.

Sreemukhi Fun With Jani Master In Bomma Adhirindi Set
Sreemukhi Fun With Jani Master In Bomma Adhirindi Set

తాజాగా శ్రీముఖి కొన్ని వీడియోలను షేర్ చేసింది. బొమ్మ అదిరింది సెట్ నుంచి శ్రీముఖి, జానీ మాస్టర్ సింగర్ సాకేత్ చేసిన అల్లరి బయటకు వచ్చింది. షో షూటింగ్ జరుగుతూ ఉండగా.. ఈ ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇక ఇదే సందు అనుకుని జానీ మాస్టర్‌ను శ్రీముఖి ఏడిపించేసింది. జానీ మాస్టర్‌.. మీరు ఇన్ స్టాగ్రాంలో ఎందుకు యాక్టివ్ ఉండరు అని చిలిపిగా ప్రశ్న వేసింది శ్రీముఖి. ఆ ప్రశ్నకు జానీ మాస్టర్ సమాధానం చెప్పే లోపే.. పక్కనున్న సింగర్ సాకేత్.. నేను చెబుతా అంటూ ముందుకు వచ్చాడు.

బయట బాగా బిజీగా ఉంటాడు కాబట్టి.. ఇన్ స్టాగ్రాంలో ఉండదు అని జానీ మాస్టర్‌పై సాకేత్ కౌంటర్ వేశాడు. సాకేత్ చెప్పిన మాటలు డబుల్ మీనింగ్‌లా ఉన్నాయని జానీ మాస్టర్ కవర్ చేసేందుకు ఏదో చెబుతూ ఉండగా శ్రీముఖి మరో సెటైర్ వేసింది. చెప్పు చెప్పు ఎన్ని స్టోరీలు చెబుతావో చెప్పు అంటూ జానీ మాస్టర్‌ను ఏడిపించే ప్రయత్నం చేసింది. మొత్తానికి శ్రీముఖి, జానీ మాస్టర్‌లు షేర్ చేసిన ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది.

Jani Master, Sreemukhi, Bomma Adirindi, జానీ మాస్టర్, శ్రీముఖి, బొమ్మ అదిరింది