క్రేజీ బజ్ – “వీరమల్లు” కోసం పవన్ తో స్పెషల్ ట్రీట్ ప్లాన్?

hariharaveeramallu-views-1024x768

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన మాసివ్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో అందులోని మొదటి పాన్ ఇండియా సినిమాగా వస్తుండడంతో ఎనలేని హైప్ ఉంది.

అయితే ఈ హైప్ ఏమో కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం గత మూడేళ్లు నుంచి జరుగుతూనే ఉంది కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే అయినా కూడా పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని మేకర్స్ గట్టిగా దట్టిస్తుండగా ఇప్పుడు ఏమో క్రేజీ బజ్ ఈ సినిమాపై వినిపిస్తుంది.

మరి ఈ సినిమాలో అయితే పవన్ నుంచి తన మార్క్ ఫోక్ సాంగ్ ఒకటి పాడనున్నట్టుగా తెలుస్తుంది. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పవన్ తో ఓ మంచి సాంగ్ కి పాడించాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ఎలాగో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ పైగా అప్పటి సంస్కృతులు కనిపిస్తాయి కానీ డెఫినెట్ గా ఈ స్కోప్ ఉందని చెప్పొచ్చు.

మరి చివరి సరిగా అయితే పవన్ పాట పాడిన రెండు సిన్మాలు “సర్దార్ గబ్బర్ సింగ్”, “అజ్ఞ్యాతవాసి” చిత్రాలు ప్లాప్ అయ్యాయి. తర్వాత వకీల్ సాబ్ లో కూడా పవన్ పాడారు అని తెలిసింది కానీ ఆ సాంగ్ అయితే సినిమాలో లేదు. మరి వీరమల్లు కి ఏమవుతుందో చూడాల్సిందే.