Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల షూటింగ్‌లతో సూపర్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’తో భారీ విజయం అందుకున్న ప్రభాస్, ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఒకవైపు మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉంటే, మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ఓ పీరియడ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా హను ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ బయటకొచ్చింది.
ప్రభాస్ ఇటీవల ఇటలీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు, వెంటనే ‘రాజా సాబ్’ డబ్బింగ్ పనుల్లో పాల్గొన్నాడు. తాజా సమాచారం ప్రకారం, మే 19న హను రాఘవపూడి ప్రాజెక్ట్ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్‌ను నెలన్నర రోజుల పాటు ప్లాన్ చేశారు, ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పార్ట్‌ని ఎక్కువగా పూర్తి చేయనున్నారట. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాత్కాలికంగా ‘ఫౌజీ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా 1940ల నేపథ్యంలో సాగే హిస్టారికల్ ఫిక్షన్. రామోజీ ఫిల్మ్ సిటీలో జైలు సన్నివేశాలు, కరైకుడిలో గ్రామీణ సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. 2025 చివరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా, ప్రభాస్‌ను బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా చూపించనుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!