గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్ కు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టింది. దీనిపై బాలు కొడుకు ఎస్పీ చరణ్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
తన తండ్రికి గొప్ప గౌరవం దక్కిందని.. ఈసందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి ఆయన ట్విట్టర్ ధన్యవాదాలు తెలిపారు.
నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సంగీత, నృత్య పాఠశాల పేరు ఇక నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుగా ఉంటుందని దానికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు.
ఎస్పీ బాలుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని.. దీనిపై బాలు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Great full to the #APgov and @ysjagan garu for this honor. https://t.co/qUvHsOP4ZM
— S. P. Charan (@charanproducer) November 27, 2020