సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి బాగా విషమించినట్టు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కరోనాతో గత నెల 5న బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి బాలు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల కింద ఆయనకు కరోనా తగ్గింది. ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడింది. దీంతో త్వరలోనే ఆయన్ను డిశ్చార్జి చేస్తారని బాలు కొడుకు చరణ్ తెలిపారు.
బాలుకు కరోనా తగ్గినా.. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండటంతో.. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కానీ.. సడెన్ గా గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నాయి.
గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. ప్రత్యేక వైద్య నిపుణులు ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఎక్మో, వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నాం.. అని డాక్టర్లు తెలిపారు.
అయితే.. కరోనాను జయించిన బాలు.. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు.. అని ఆయన అభిమానులు భావించినా.. సడెన్ గా ఆయన ఆరోగ్యం తిరగబడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.