రియల్ హీరో సోనూసూద్ కరోనా కాలంలో వలస జీవులకు ఎన్నో సాయాలు చేశారు. ఇప్పటికీ ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ఏమాత్రం వెనకాడని రీల్ విలన్ సోనూసూద్. ఎంతోమంది పేదలను, అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నాడు. కోట్లు సంపాదించే రాజకీయ నాయకులే ప్రజలను పట్టించుకోని ఈ రోజులలో సోనూసూద్ ఇన్ని సాయాలు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేస్తున్నసేవలకు స్టాచ్యూలు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు వారి పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టి రుణం తీర్చుకుంటున్నారు.
జీవితంలో మంచి, చెడు రెండు ఉంటాయి. అలానే మనం చేసిన పనిని కొందరు మెచ్చుకుంటారు, మరి కొందరు వ్యతిరేఖిస్తారు. సోనూసూద్ చేస్తున్న సేవలను చాలా మంది విమర్శించారు. అవేమి పట్టించుకోకుండా సోనూసూద్ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. రోజుల తరబడి రహదారులపై నడుస్తూ తినడానికి తిండి లేక పడుకోడానికి షెల్టర్ లేక అల్లాడిపోయిన వారికి దారులు చూపించాడు. రూ.కోట్లు ఖర్చు పెట్టి బస్సులు రైళ్లు విమానాలు బుక్ చేసి వలస కూలీలను వారి వారి గ్రామాలకు తరలించాడు.
తాజాగా రిషి భగ్రీ అనే నెటిజన్.. సోనూసూద్ సేవలను విమర్శించాడు. కొత్త ట్విటర్ అకౌంట్. ముగ్గురు ఫాలోవర్లు. తన వైద్యానికి సహాయం చేయలంటూ ఒకే ఒక ట్వీట్. కనీసం సోనూను ట్యాగ్ చేయలేదు. అంతకు మించి ఏ వివరాలు పొందుపరచలేదు. అయిన ఆ ట్వీట్‌కు సోనూసమాధానం ఇచ్చాడు. ఇదెలా సాధ్యం అని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన సోనూసూద్ .. ఇదే గొప్ప విషయం . ఇబ్బందుల్లో వారిని నేను గుర్తిస్తా. ఇది చిత్తశుద్ధికి సంబంధించినవి. మీకు అర్దం కాదు. రేపు పేషెంట్ ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో ఉంటాడు. నీకు సాయం చేయాలనిపిస్తే చేయి. అతడికి కొన్ని పండ్లు పంపించు అంటూ రోగి వివరాలు కూడా షేర్ చేశాడు