సోలో బ్రతుకే సో బెటర్.. మొత్తం లాభం ఎంతంటే?

sai dharam tej comments on solo brathuke so better and personal life

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ మొత్తానికి ఇండస్ట్రీ భవిష్యత్తుకు ఒక ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కరోనా లాక్ డౌన్ తరువాత విడుదలైన మొట్ట మొదటి పెద్ద సినిమా అదే. ఈ సినిమా విడుదలైనప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్కటిగా నిలబడి సినిమాకు మద్దతు ఇచ్చింది. అందుకే ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి.

ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా పోరాటం ముగిసింది. సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తుండడంతో థియేటర్స్ తగ్గాయి. ఫైనల్ గా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్ గా 21.25కోట్ల రూపాయల గ్రాస్ కెలెక్షన్స్ అందించిన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టార్గెట్ రూ.9.6కోట్లు. అయితే సినిమా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 11.68కోట్ల షేర్స్ ను అంధించాయి.

ఇక వరల్డ్ వైడ్ షేర్స్ విషయానికి వస్తే 12.61కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. అంటే సినిమాకు వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ రూ.3.01కోట్లని తెలుస్తోంది. థియేటర్స్ లో కేవలం 50% సిట్టింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ ఈ స్థాయిలో లాభాలను అందుకుందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఏదేమైనా సంక్రాంతి సినిమాలకు సోలో బ్రతుకే సో బెటర్ ఒక బలమైన నమ్మకాన్ని ఇచ్చింది. మరి సంక్రాంతి సినిమాలు ఏ స్థాయిలో లాభాలను అందుకుంటాయో చూడాలి.