ఒకప్పుడు సినిమా టికెట్లు కొనాలంటే థియేటర్ల బయట గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి వచ్చేది. అలా చేస్తే గానీ టికెట్లు దొరికేవి కావు. కానీ ఇప్పుడు బుక్ మై షో, పేటీఎం లాంటి అనేక యాప్స్ వచ్చిన తర్వాత క్షణాల్లో మనకు కావాల్సిన సీటును సైతం బుక్ చేసుకునే అవకాశం దొరికింది. ఒకరకంగా ప్రధాన టికెట్ బుకింగ్ పార్ట్నర్ గా అన్ని థియేటర్లకు మల్టీప్లెక్స్ లకు బుక్ మై షో వారధిగా మారింది. ఎక్కువ టికెట్లు బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ అవుతున్నాయి.
అయితే ఈ బుక్ మై షో టికెట్స్ ను అమ్మే క్రమంలో డబ్బులు ఎక్కువ అవుతున్నాయనే కంప్లైంట్ అయితే ఉన్నప్పటికీ… 90 శాతం టికెట్స్ బుక్ మై షో, పే టీ ఏం లాంటి యా ద్వారానే ప్రేక్షకులు బుక్ చేసుకుంటున్నారు. ఇక రాబోతున్న సినిమాల మీద ఎవరు ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారో లైట్ బుక్ మై షో యాప్ లో లైక్ ను బట్టి తెలుస్తుంది. అవుతున్న సినిమాల లిస్టులో ఏవి ఎక్కువగా లైక్స్ పొందాయో చూద్దాం.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ మూవీ కోసం ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు. దీనికి నిదర్శనం బుక్ మై షో లో ఈ సినిమాకి వచ్చిన లైక్స్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చలార్ మూవీకి 98 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో మళ్లీ ప్రభాస్ సినిమానే నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు 73k ప్లస్ లైక్స్ వచ్చాయి.
ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా నిలిచింది. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది. హరిహర వీరమల్లు సినిమాకు 50k ప్లస్ కి పైగా లైక్స్ వచ్చాయి.
నాలుగవ స్థానంలో అట్లి దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమా నిలిచింది. ఈ సినిమాకు 35కే ప్లస్ లైక్స్ వచ్చాయి. ఐదవ స్థానంలో టైగర్ 3 నిలవగా దీనికి 21కే ప్లస్ లైక్స్ వచ్చాయి. ఇక ఆరోవ స్థానంలో లోకేష్ కనకరాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో సినిమా నిలిచింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాకి 20 కే ప్లస్ లైక్స్ వచ్చాయి. ఇక భారతీయ సినిమాలు చూడాలి మునుముందు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో అని.