యాంకర్ ప్రదీప్ ఎఫైర్‌పై కామెంట్స్.. సింగర్ సునీత వ్యాఖ్యలు వైరల్

Singer Sunitha About Anchror Pradeep And Harika Narayan

సోషల్ మీడియాలో ఈ మధ్య యాంకర్ ప్రదీప్‌కు ఓ కొత్త జోడిని పెట్టారు. సరిగమప అనే షోలో హారిక నారాయణ్ ప్రదీప్ మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. మెంటర్‌గా ఉన్న హారిక నారాయణ్‌ను ప్రదీప్ ట్రై చేస్తున్నాడని రవి కామెంట్ చేయడం తెగ వైరల్ అయింది. ప్రదీప్ ఎంత ట్రై చేస్తున్నా కూడా హారిక పడటం లేదని రవి అనడంతో అప్పటి నుంచి ఈ ఇద్దరి జోడిపై అందరూ కన్నేశారు.

Singer Sunitha About Anchror Pradeep And Harika Narayan
Singer Sunitha About Anchror Pradeep And Harika Narayan

మామూలుగా అయితే సింగింగ్ ప్రోగ్రాంలో ఇలాంటి చెత్త టాపిక్‌లను ఎంకరేజ్ చేయరు. కానీ ఈసారి మాత్రం కోటి, శైలజ, చంద్రబోస్ వంటి వారున్నా కూడా ఇలాంటి ట్రాకులు, ఎఫైర్లను షోలో నడిపిస్తున్నారు. అయితే తాజాగా సునీత ఈషోలో గెస్ట్‌గా వచ్చింది. సునీతకు అలా అనమని ముందే స్క్రిప్ట్ ఇచ్చారో ఏమో తెలియదు గానీ ప్రదీప్ హారికల ట్రాక్ గురించి కామెంట్ చేసింది. సునీత కూడా కామెంట్ చేసిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సునీత.. హారిక నారాయణ ప్రదీప్‌ల గురించి మాట్లాడుతూ ఉంటే కెమెరామెన్, ఎడిటర్ తమ పనితనాన్ని చూపించారు. హారిక సిగ్గుపడుతున్న విజువల్స్‌ను బాగానే కట్ చేశారు. ప్రదీప్ శ్రద్ద ఎక్కడో పెడుతున్నాడని సునీత అంటే హారిక బాగానే సిగ్గుపడుతోంది. మొత్తానికి ఇలా ఈ ట్రాక్‌తో షోను బాగానే నడిపించేందుకు ప్లాన్‌ వేసినట్టు కనిపిస్తోంది.