“డీజే టిల్లు 2” రూమర్స్ పై హీరో సిద్ధూ పోస్ట్ వైరల్.!

ఈ రెండు రోజులు నుంచి కూడా టాలీవుడ్ లో మంచి ఆసక్తిగా వినిపిస్తూ వస్తున్న లేటెస్ట్ న్యూస్ లలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం డీజే టిల్లు సీక్వెల్ “టిల్లు 2” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో వరుస పెట్టి హీరోయిన్స్ బయటకి వెళ్ళిపోతూ ఉండడం కొత్త హీరోయిన్స్ వస్తుడడంతో సినిమా కాస్త డౌట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ అన్నట్టుగా సిద్ధూ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారిపోయింది. మొన్న సినిమా షూట్ పై అప్డేట్ ఇస్తూ దీనికి రిప్లై గా మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు అని సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై కూడా బిగ్ అప్డేట్ వదిలాడు.

తాము అయితే ఈ సినిమాని వచ్చే మార్చ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. అలాగే రూమర్స్ పై కూడా మాట్లాడుతూ ఈ సినిమా పై వస్తున్న రూమర్స్ పై కూడా ఓసారి అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్వ్యూ లో అందరి ప్రశ్నలకి క్లారిటీ ఇస్తానని తాను తెలిపాడు. ఇప్పుడు అయితే అనుపమ బయటకి వెళ్లగా మడోనా యాడ్ అయ్యింది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. 
https://twitter.com/Siddu_buoy/status/1597766632159387648