మరో టాలెంట్ ని బయటికి తీస్తున్న శృతిహాసన్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతిహాసన్. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ వస్తుంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.

ప్రభాస్ కి జోడిగా నటించిన సలార్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో శృతిహాసన్ ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోతుంది అని చెప్పాలి. గ్లామర్ బ్యూటీగా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శృతిహాసన్ లో ఒక పాప్ సింగర్ కూడా ఉంది. అలాగే మంచి మ్యూజిషియన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

తన తండ్రి కమల్ హాసన్ నటించిన ఈనాడు సినిమాకి శృతిహాసన్ సంగీతం అందించింది. అలాగే ఆమె మ్యూజిక్ లో చాలా ఆల్బమ్స్ వచ్చాయి. తనకి ఒక మ్యూజిక్ ట్రూప్ కూడా ఉంది. దాంతో రెగ్యులర్ గా విదేశాలలో షోలు కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు తనలోని సింగింగ్ టాలెంట్ ని ఆల్బమ్ సాంగ్స్ ద్వారా శృతిహాసన్ బయటపడుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తనలో మరో హిడెన్ టాలెంట్ ని బయటకు తీసే ప్రయత్నం కమల్ హాసన్ కూతురు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పడం విశేషం. తనలోని రైటింగ్ టాలెంట్ ని బయటకు తీసుకొస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఒక స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నానని తెలిపింది. త్వరలో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ కచ్చితంగా చెబుతానని స్పష్టం చేసింది.

అయితే ఆమె స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే తనని తాను పరిచయం చేసుకుంటుందా లేదా తండ్రి తరహాలో దర్శకురాలిగా కూడా మారి తన టాలెంట్ చూపిస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా తండ్రి కమలహాసన్ తరహాలోని శృతిహాసన్ కూడా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా ఉంటూనే తనలో ఉన్న అన్ని టాలెంట్ ని బయటపెడుతూ వస్తుంది. అలాగే హీరోయిన్ గా ఒకచోట ఫిక్స్ అయిపోకుండా ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ ని పోషించాలని భావిస్తుంది.