Shreya Sharan:తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్‌గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్.ఒకప్పుడు అగ్రతారగా వెలుగొందిన అమ్మడుకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. అదే ట్రాక్ ను మెయిన్టైన్ చేస్తూ వస్తుంది.ఇటీవల ‘గమనం’లో కీలక పాత్రలో నటించింది..ఆ సినిమా తర్వాత వరుస సినిమా లలో నటిస్తూ బిజిగా ఉంటూ అభిమానులను అలరిస్తూ వస్తుంది..ఇది ఇలా ఉండగా.. వివాహ అనంతరం నుంచి అర కొర సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగన్ కు జోడిగా నటించింది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి శ్రియ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాను నేను ఇంకా చూడలేదు, నిజానికి నేను ఆర్ఆర్ఆర్ టికెట్లు కోసం ఎంత ప్రయత్నించినా టికెట్లు మాత్రం నాకు దొరకలేదు. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.మా కుటుంబంతో ఈ సినిమాను తర్వలొనె చూస్తాను అని చెప్పింది.
ఇక ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసింది.ఓ గొప్ప ప్రాజెక్టులో నా పేరు కూడా ఉంటే. ఆ సంతోషం వేరేలా ఉంటుంది. నాకు అలాంటి సంతోషం కలిగింది. రాజమౌళి సినిమా అనగానే ఇంకేం ఆలోచించలేదు. హీరోలు ఎవరు? కథేంటి? నా పాత్ర ఏమిటని కూడా అడగలేదు. రాజమౌళిని అంత నమ్మాను. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి అంతా గొప్పగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా వుందివుంది, అని శ్రీయ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.