Kalyan Dev: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకోబోతుందని.. అది చిరు కుటుంబం నుంచేనని కొంత కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అంతా ఇంతా కాదు. దీనిపై అటు కళ్యాణ్ దేవ్ కానీ.. ఇటు మెగా కుటుంబం కానీ ఏం స్పందించకపోయేసరికి అందరూ సందిగ్ధంలో పడిపోయారు.
సాధారణంగా మెగా కుటుంబం నుంచి ఎలాంటి వార్త వచ్చినా నిమిషాల్లో ట్రెండింగ్ కావడం విశేషం. ఆ కుటుంబం నుంచి ఏదైనా సినిమా వస్తుందని తెలిసినా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక చిరు సినిమా రిలీజ్ అయిందంటే హౌస్‌ఫుల్ బోర్డులు.. బ్లాక్ బస్టర్ హిట్‌లు. ఆయన ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్ని ఫ్లాపులు వచ్చినా సక్సెస్‌లతో పాటు అపజయాలనూ ఒకేరకంగా స్వీకరిస్తూ దూసుకుపోతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు చిరు. అలాంటిది ఆ ఇంటిల్లుడి గురించి ఏదైనా వార్త బయటికి వచ్చిందంటే కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఉండడం గమనార్హం.
ఇకపోతే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ తరచూ విహారయాత్రలకు వెళుతూ, వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఆయన మేక్ ఓవర్ లుక్ ఉన్న పిక్‌ను పోస్ట్ చేస్తూ నీకు ఎవరైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు.. ఒక నవ్వు నవ్వి వదిలెయ్.. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ ట్యాగ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా వీకెండ్ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ శనివారం నుంచి సోమవారం మధ్యలో అంటూ క్యాప్షన్‌ను జత చేసిన కళ్యాణ్… వీకెండ్ తర్వాత సోమవారం మన మూడ్ ఎలా ఉంటుంది అంటూ వివిధ లుక్స్‌తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన తన మూడో సినిమా అయిన కిన్నెర సాని ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నట్టు సమాచారం.