ఫోటోలు, వీడియోలు షేరే చేసే సోషల్ మీడియా యాప్‌ను ఇండియాలో కొన్ని మిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినోదం, సామాజిక, ఇతరాత్ర కంటెంట్‌తో తమ సంబంధాలను మెరుగు పురుచుకుంటున్నారు.
ప్రస్తుతం సెలబ్రిటీలకు తమ వృత్తితోపాటు సోషల్ మీడియా కూడా ముఖ్యమే.. తమను ఆరాధించే అభిమనులకు చేరువుగా ఉండేందుకు సోషల్ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుంది. తమకు చెందిన వృత్తి, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వీరికి లక్షల్లో ఫాలోవర్సు ఉంటారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్ సెలబ్రిటీలలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మూడో స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న ఈ సాహో భామ మరో నటి దీపికా పదుకొనెను వెనక్కునెట్టి మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు దీపికా పదుకొనె 52.3 మిలియన్లతో మూడో స్థానంలో ఉంటే, తాజాదా శ్రద్ధా కపూర్ ఆమెను దాటుకొని 56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా ఈ సాహో భామ మరో నటి దీపికా పదుకొనెను వెనక్కునెట్టి మూడో స్థానానికి దూసుకెళ్లడం ఎలా అనిపిస్తోంది? అని మీడియా ప్రశ్నిస్తే.. “చాలా హ్యాపీగా ఉంది. దీపికా పదుకొనెను వెనక్కునెట్టడం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఆరాధించే అభిమనులకు చేరువుగా ఉండేందుకు సోషల్ మీడియా ద్వారా మరింతగా ముందుకెళ్తా” అని చెప్పుకొచ్చింది. దటీజ్.. శ్రద్ధా కపూర్!?