పూర్ణ పెళ్ళికి భర్త ఆసిఫ్ ఇచ్చిన కానుకల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా తెలుగు బుల్లితెరపై కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ విధంగా ఈమె తాను నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని చెప్పినప్పటికీ వివాహాన్ని మాత్రం రహస్యంగా చేసుకున్నారు.

ఈ విధంగా పూర్ణ రహస్య వివాహం చేసుకున్న అనంతరం కొద్ది నెలలకు తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని బయట పెట్టారు.ఇలా ఈమె కొన్ని కారణాలవల్ల దుబాయిలో కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి జరిగిందని తెలియజేస్తూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి ఫోటోలలో పూర్ణ ఒంటి నిండా బంగారం వేసుకొని ఎంతో అందంగా కనిపించారు. అయితే పెళ్లికి కానుకగా తన భర్త ఆసిఫ్ తనకు పెద్ద ఎత్తున బంగారం కొనిచ్చారని తెలుస్తుంది.

పెళ్లికి ముందే పూర్ణకు ఆసిఫ్ ఏకంగా 2700 గ్రాముల బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చినట్టు సమాచారం. ఈ బంగారం విలువ సుమారు ఒకటిన్నర కోటి వరకు విలువ చేస్తుందని తెలుస్తుంది.ఈ బంగారం తో పాటు ఖరీదైన అపార్ట్మెంట్ కూడా తనకు కానుకగా ఇచ్చారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ అపార్ట్మెంట్ కూడా సుమారు 25 నుంచి 28 కోట్ల విలువ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఆసిఫ్ పూర్ణకు పెళ్లికి కానుకగా ఏకంగా 30 కోట్ల విలువ చేసే కానుకలు ఇచ్చారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.