Alia – Ranbir: ఆలియాకు రణ్‌బీర్‌ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Alia – Ranbir: బాలీవుడ్‌ ప్రేమ జంట ఆలియా భట్‌,రణ్‌బీర్‌ కపూర్‌ ల గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. వీరి ఎప్పుడెప్పుడు ఒకటవుతారా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ వీరిపెళ్లి గత ఏడాదే జరగవలసి ఉండగా కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆలియా భట్‌,రణ్‌బీర్‌ కపూర్‌ ల అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

తాజాగా గురువారం రోజున ఈ జంట పెళ్లి ఇరు కుటుంబాలు కొద్దిమంది స్నేహితులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆలియా భట్‌,రణ్‌బీర్‌ కపూర్‌ ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్లి తర్వాత బయటకు వచ్చి ఫోటోలు కూడా ఫోజులు ఇచ్చింది ఈ జంట. ఇదిలా ఉంటే పెళ్లి సందర్భంగా ఆలియా భట్‌ కు రణ్‌బీర్‌ కపూర్‌ ఒక కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారని బాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు కోడై కూస్తున్నాయి.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం రణ్‌బీర్‌ తన ప్రేయసి, శ్రీమతి కి డైమండ్ తో చేసిన గిఫ్ట్ ఇచ్చాడు అని తెలుస్తోంది. బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్ లో ఈ జంట పెళ్లి ఘనంగా వైభవంగా జరిగింది. రణ్‌బీర్‌ ఆలియా కు కాస్ట్లీ డైమండ్ బ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ బ్యాండ్లో దాదాపుగా ఎనిమిది డైమండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డైమండ్ ల ధర ఎంత అన్నది తెలియదు కానీ,రణ్‌బీర్‌ ఎనిమిది డైమండ్స్ మాత్రమే ఎందుకు ఇచ్చాడు అన్న విషయం పట్ల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఒక లాజిక్ ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే రణ్‌బీర్‌ లక్కీ నెంబర్ 8. దీనితో ఆలియా కు ఇచ్చిన డైమండ్ బ్యాండ్ లో ఎనిమిది డైమండ్స్ ఉండేలా చూసుకున్నాడు. పెళ్లి ఫోటోలు ఆలియాభట్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం అలియాభట్,రణ్‌బీర్‌ కపూర్ ల పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు కొత్త జంట కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే మూడుముళ్ల బంధంతో ఇవ్వాల్సిన ఈ జంట పెళ్లి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇలా చివరికి ఏప్రిల్ 14న 2022 లో జరిగింది.