ఆ స్టార్ హీరోకు తినడానికి అన్నం లేని దీనస్థితి.. షాకింగ్ విషయాలు రివీల్!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ధనుష్ పారితోషికం తీసుకుంటున్నారు. హీరోగా ధనుష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయనకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ధనుష్ హీరో ఏంటి అంటూ చాలామంది ఆయనపై నెగిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం. కస్తూరి రాజా కొడుకు ధనుష్ అనే సంగతి తెలిసిందే.

ధనుష్ పూర్తి పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా కాగా సినిమాల కోసం ఆయన పేరు మార్చుకున్నారు. ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరనే సంగతి తెలిసిందే. తమిళంలో సెల్వ రాఘవన్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. బాల్యంలో ధనుష్ ఒక్కపూట మాత్రమే తిండి తిన్న సందర్భాలు సైతం ఉన్నాయి. ధనుష్ తండ్రి కస్తూరి రాజా కడు పేదరికం వల్ల నిత్య జీవితంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

కస్తూరి రాజా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. ధనుష్ కు కెరీర్ తొలినాళ్లలో నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆసక్తి లేకపోవడంతో ధనుష్ ఏడ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ధనుష్ ఐశ్వర్య ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. తన నటనతో ధనుష్ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

ధనుష్ జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగించారు. ధనుష్ రాసిన కొలవరి పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ బాలీవుడ్, ఆంగ్ల సినిమాలలో నటించి ప్రత్యేకతను చాటుకున్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేని స్థితి నుంచి ధనుష్ ప్రస్తుతం కోట్ల ఆస్తికి అధిపతిగా మారిపోయారు.