షాకింగ్ న్యూస్ : కమల్ హాసన్ కి ఏమయ్యింది.?

Kamal Haasan Interview

తమిళ నాట బిగ్ స్టార్ ఉలగనయగన్ కమల్ హాసన్ కోసం ఇండియన్ సినిమాకి పరిచయం చెయ్యక్కర్లేదు. తన కెరీర్ లో చాలా కాలం తర్వాత భారీ హిట్ “విక్రమ్” తో మళ్ళీ తమిళ సినిమా దగ్గర ఇండస్ట్రీ హిట్ కొట్టిన తాను ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా దర్శకుడు శంకర్ తో తమ భారీ హిట్ “ఇండియన్” కి సీక్వెల్ “ఇండియన్ 2” ని అయితే ఇప్పుడు భారీ బడ్జెట్ తో చేస్తున్నారు.

ఇక ఈ అవైటెడ్ చిత్రం షూటింగ్ చేస్తూ ఉండగా మేకర్స్ ఇప్పుడు కమల్ హాసన్ ఆరోగ్యానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది. నిన్న ఉదయం వరకు బాగానే ఉన్న కమల్ నిన్న సాయంత్రమే అనారోగ్యానికి గురైనట్టుగా వార్తలు రావడం అభిమానులని కలవర పెట్టగా ఇప్పటికే విషాదంలో ఉన్న టాలీవుడ్ లో కూడా షాకింగ్ గా మారింది.

అయితే కమల్ హాసన్ కి నిన్న కాస్త జ్వరం మరియు జలుబుగా అనిపించేసరికి చెన్నై లోని హాస్పిటల్ తాను చూపించుకోడానికి వెళ్లారట. దీనితో ఈ న్యూస్ బయటకి రాగా ఇది వైరల్ అయ్యింది. ఇక ఈ రోజు ఉదయం అయితే కమల్ మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా వెళ్ళిపోయినట్టు తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు కమల్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకోగా అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.