గడిచిన కొన్నేళ్లలో పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషన్ గా మారిన లేటెస్ట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన హ్యాట్రిక్ సినిమా “పుష్ప” కూడా ఒకటి. కాగా ఇప్పుడు దీని సీక్వెల్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా యూనిట్ అండ్ సినీ వర్గాల్లో ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది.
దీనితో పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ తో లాస్ట్ వరకు కనిపించిన యంగ్ నటుడు ‘కేశవ'(జగదీశ్ ప్రతాప్ బండారి) కి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ మధ్య తనకి అవార్డు వస్తే తాను స్టేజి మీదే ఎమోషనల్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ కీలక నటుడుని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు షాకింగ్ గా మారాయి.
అయితే మరిన్ని వివరాల్లోకి వెళితే జగదీశ్ ప్రతాప్ ఓ లేడీ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసు విషయంలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకా షాకింగ్ అంశం ఏమిటంటే ఆమెవి కొన్ని ప్రవేట్ ఫోటోలు జగదీశ్ దగ్గర ఉండగా తాను ఆ ఫొటోలతో ఆమెని బ్లాక్ మెయిల్ చేసాడని దీనితో ఆమె బలవన్మరణంకి పాల్పడినట్టుగా హైదరాబాద్ పోలీస్ లు చెప్తున్నారు.
మరి ఆమె తండ్రి పెట్టిన కేసు మేర జగదీశ్ ని హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసారని ఇపుడు వార్తలు బయటకి వచ్చాయి. మరి ఇలాంటి ఓ కేసు విషయంలో తాను అరెస్ట్ కావడం అనేది షాకింగ్ అని చెప్పాలి. మరి అసలు నిజం ఏంటి అనేది వేచి చూడాలి. అలాగే ఈ షాక్ తో పుష్ప 2 షూటింగ్ కి కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే తాను పార్ట్ 2 లో కూడా చాలా కీలక పాత్రలో నటిస్తున్నాడు.