Ladia Diamond Jewellery: విశాఖలో అట్టహసంగా లాడియ డైమండ్ జువెల్లరి ప్రారంభం.. సందడి చేసిన సినీనటి సంయుక్త మీనన్

Ladia Diamond Jewellery: విశాఖ, ద్వారకా నగర్ లోని లాడియ డైమండ్ జువెల్లరి శనివారం ఉదయం అట్టహసంగా ప్రారంభమైంది. సినీనటి సంయుక్త మీనన్ తో కలసి లాడియ జువెల్లరి డైరెక్టర్ అఖిల్ వేములూరి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఫ్రీ లాంచ్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ ఫోటోలకు పోజులిచ్చి సందడి చేశారు. అనంతరం అఖిల్ వేములూరి మీడియాతో మాట్లాడుతూ భారతదేశం వజ్రాల ల్యాబ్ -గ్రోన్ వజ్రాల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగంలో వినూత్న ఆలోచనలతో విభిన్న ఆవిష్కరణలకు లాడియ కట్టుబడి ఉన్నాదని తెలియజేయడానికి సంతోషిస్తున్నామన్నారు.

సహజ వనరుల నివారణ, హానికరమైన మైనింగ్ పద్ధతులను తగ్గించడం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రత్యేకత అని తెలిపారు. లాడియ ల్యాబ్లో రూపుదిద్దుకునే వజ్రాభరణాలు కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలతో తయారు చేయబడతాయని అఖిల్ చెప్పారు. ఇక్కడ ఎంతో నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వజ్రాభరణాలు తయారు చేస్తారని తెలిపారు. ఈ ల్యాబ్లో తయారు చేయబడే సహజమైన ప్రకృతి సిద్ధమైన వజ్రాభరణాలు మేలు కలిగిస్తాయని పేర్కొన్నారు. ల్యాబ్లో చేయబడిన వజ్రాలు సహజ వజ్రాల వలె అదే రంగు, స్పష్టత స్థాయిని ఉపయోగించి కూడా గ్రేడ్ చేయబడినవని అఖిల్ తెలిపారు.

లాడియలో తయారు చేయబడిన బంగారు వజ్ర ఆభరణాలు విస్తృత ఎంపికతో లభిస్తాయని చెప్పారు. నెక్లెస్లు, బ్యాంగిల్స్, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, ఝుమ్కాస్, ఉంగరాలు ప్రత్యేకమైన ల్యాబ్లో పోల్కిస్, కస్టమైజేషన్-మేక్ యూరోన్ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. నవంబరు 29 నుంచి డిసెంబర్ 14 వరకు వజ్రాలు, మేకింగ్ చార్జీలపై 15% తగ్గింపును ప్రకటించారు. నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ మహిళలు మెచ్చే వివిధ డిజైన్లతో కూడిన డైమండ్ జువెల్లరి లాడియలో అందుబాటు ధరలో లభిస్తాయని పేర్కొన్నారు. పెళ్లిళ్లు, పండగ సీజన్లలో అందరూ మెచ్చేలా డైమండ్ జ్యువెలరీ విక్రయాలకు లాడియ ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ జ్యువెలరీ డైమండ్ షోరూమ్ ను విశాఖ వాసులు సందర్శించి, ఆదరించాలని కోరారు. అఖిల్ వేమూలూరి సతీమణి సాత్విక పాల్గొన్నారు.

అఖండ 2 క్లైమాక్స్ లో | Journalist Bharadwaj About Balakrishna Akhanda 2 Movie | Telugu Rajyam