షాకింగ్ : “జైలర్” సినిమా నటుడు మృతి..!

ఈ ఏడాది ఇండియా సినిమా సహా దక్షిణాది సినిమా నుంచి వచ్చిన రికార్డు గ్రాసింగ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “జైలర్” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ నటించగా నిన్ననే ఈ సినిమా ఓటిటి లో కూడా పాన్ ఇండియా భాషల్లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చింది.

కాగా ఈ చిత్రం కోసం ఇలా అంతా మాట్లాడుకుంటూ ఉండగా ఇప్పుడు ఓ ఊహించని వార్త జైలర్ లో నటించిన ఓ నటునిపై వినాల్సి వచ్చింది. కాగా ఈ చిత్రంలో విలన్ పక్కనే మెయిన్ హ్యాండ్ పాత్రలో నటించిన ప్రముఖ నటుడు మారిముత్తు ఇక లేరు అనే వార్త ఇపుడు షాకింగ్ గా మారింది. ఈ సినిమా సహా ఎన్నో చిత్రాల్లో నటించిన తాను ఈ ఉదయం గుండెపోటుతో మరణించారట. దీనితో ఈ వార్తతో కోలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరి ఆయన విషయంలో ఇలాంటి వార్త వింటాం అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. దీనితో సోషల్ మీడియాలో కూడా అనేకమంది మారిముత్తు ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి మారిముత్తు పలు చిత్రాలు సహా సీరియల్స్ లో కూడా నటించారట అంతే కాకుండా ఓ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారని తెలుస్తుంది.