షాకింగ్ : అప్పుడే ఓటిటిలో “2018” చిత్రం.!

లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర ఎంతో సంచలనం సృష్టిస్తున్న లేటెస్ట్ చిత్రం “2018”. మలయాళ సినిమా నుంచి వచ్చిన ఈ సినిమా అక్కడ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా మన తెలుగులో కూడా మొన్ననే రిలీజ్ అయ్యి ఇక్కడా భారీ వసూళ్లు కొల్లగొడుతుంది.

మరి ఇదిలా ఉండగా ఈ మాసివ్ హిట్ సినిమా థియేటర్స్ లో ఓ పక్క సంచలనం రేపుతుండగా మూవీ లవర్స్ కి అయితే ఇప్పుడు షాక్ తగిలింది. ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా రాణించాలి అని కోరుకున్న వారికి “2018” ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయ్యింది అని షాక్ అవుతున్నారు.

కాగా ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ ఓటిటి సంస్థ వారు “సోని లివ్” అన్ని భాషల హక్కులు సొంతం చేసుకోగా ఇపుడు ఈ యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రావడానికి రెడీ అయిపొయింది. కాగా ఈ చిత్రం జస్ట్ మరో వారంలోనే ఓటిటి లో వచ్చేయనుందట. లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం ఈ జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కి రానుందట.

ఇంత త్వరగా స్ట్రీమింగ్ అనేది ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. దీనితో చాలా మంది థియేటర్స్ లో చూడకపోవచ్చు. ఇక ఈ చిత్రం అయితే ఆల్రెడీ సోమవారం కూడా ఏపీ తెలంగాణాలో మంచి వసూళ్లు రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో తొవినో థామస్ సహా అనేక మంది కీలక పాత్రల్లో నటించగా జూడే ఆంథోని దర్శకత్వం వహించారు.